తెలంగాణలో ఓమిక్రాన్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్‌గా నిర్దారణ
Two omicron cases registered in Telangana. తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో మూడు ఓమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
By అంజి Published on 15 Dec 2021 11:21 AM ISTతెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో మూడు ఓమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కెన్యా, సోమాలియా దేశాల నుండి వచ్చిన ఇద్దరూ ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వారి నమూనాలను సీసీఎంబీకి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు కోసం పంపారు. ఈ పరీక్షల్లో వారికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు బయటపడింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఓమిక్రాన్ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఓమిక్రాన్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
కెన్యా పౌరురాలి వయసు 24 ఏళ్లు కాగా, సోమాలియా పౌరుడి వయస్సు 23 ఏళ్లు అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించామని, మంగళవారం రాత్రి ఫలితాలు వచ్చాయన్నారు. వారిద్దరికి ఓమిక్రాన్ పాజిటివ్ అని తెలిందన్నారు. ప్రస్తుతం ఓమిక్రాన్ బాధితులను టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు ఇద్దరూ కూడా టోలీచౌకీ, మెహదీపట్నంలో ఉంటున్నారు. వీరి ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. మూడో వ్యక్తికి కూడా ఓమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. అయితే అతడి వయసు ఏడేళ్లు కావడం గమనార్హం. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన సదరు బాలుడు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగి నేరుగా కోల్‌కతా వెళ్లాడని అధికారులు తెలిపారు.
ఇప్పటికే వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటికే మాస్క్‌ను తప్పనిసరి చేసింది. మరో వైపు నిన్న ఒక్కరోజే 12 ఓమిక్రాన్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 60కిపైగా చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 28 కేసులు, రాజస్థాన్‌లో 17, ఢిల్లీలో ఆరు, గుజరాత్‌లో నాలుగు, కర్ణాటకలో మూడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ఒక్కటి చొప్పున ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.