స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకల్లో విషాదం.. ఇద్ద‌రు మృతి

Two electrocuted while hoisting national flag in Telangana. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇంద్రేశం గ్రామంలోని ఆనంద్‌నగర్‌ కాలనీలో

By Medi Samrat  Published on  15 Aug 2022 1:31 PM IST
స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకల్లో విషాదం.. ఇద్ద‌రు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇంద్రేశం గ్రామంలోని ఆనంద్‌నగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం జాతీయ జెండాను ఎగురవేస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతిచెంద‌గా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. 75వ స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలను పురస్కరించుకుని ఆనంద్ నగర్ కాలనీ వాసులు సోమవారం జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రమాదాన్ని గుర్తించకుండా.. జెండా స్తంభాన్ని విద్యుత్ తీగలకు దగ్గరగా ఏర్పాటు చేశారు. జెండాను ఎగురవేస్తుండగా క‌రెంటు వైర్లు జెండా స్తంభానికి త‌గల‌డంతో ముగ్గురు వ్య‌క్తులు విద్యుత్ షాక్‌కు గుర‌య్యారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. మృతులు అనిల్ కుమార్ (40), తిరుపతి (42) కాగా.. గాయపడిన వ్యక్తిని ధనుంజయ (38) గా గుర్తించారు. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story