ఎల్లప్పుడూ.. నైతిక విలువలు పెంచే ప్రదేశం అదే.. సజ్జనార్‌ ట్వీట్‌ వైరల్.!

Tsrtc md sajjanar tweet viral. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సజ్జనార్‌ సంస్థలో తనదైన మార్క్‌ను చూపిస్తున్నారు. అప్పుల ఊబిలో

By అంజి  Published on  27 Oct 2021 2:43 PM GMT
ఎల్లప్పుడూ.. నైతిక విలువలు పెంచే ప్రదేశం అదే.. సజ్జనార్‌ ట్వీట్‌ వైరల్.!

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సజ్జనార్‌ సంస్థలో తనదైన మార్క్‌ను చూపిస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను ఒడ్డుకు చేర్చేందుకు తన అందివచ్చిన ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రయాణికులను ఉద్దేశించి చేసిన ఓ వీడియోను సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. ''అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ నైతిక విలువలు పెంచే ఏకైక ప్రదేశం మన #TSRTC బస్సు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేద్దాం. నైతిక విలువలను పెంచుకుందాం'' అంటూ ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో విద్యార్థుల చేత చేసిన ఓ సన్నివేశం తెగ ఆకట్టుకుంటోంది. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు, మహిళలకు, గర్బిణీలకు చోటు ఇవ్వడం వంటివి ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఈ వీడియోలో పొందుపరిచారు. ఇప్పటికే ఆర్టీసీ సంస్థను గాడిన పెట్టేందుకు అనేక అంశాలను సజ్జనార్‌ పరిశీలిస్తున్నారు.

ఇటీవల హైద‌రాబాద్‌లో నెల‌ల ప‌సికందుతో ఓ మ‌హిళ మెట్రో రైలు ఎక్కింది. అయితే.. అప్ప‌టికే అక్క‌డ ఉన్న సీట్ల‌న్ని నిండిపోయాయి. ఆ బోగిలో ఉన్న‌వారంద‌రూ మ‌హిళ‌లే. చేతిలో చంటి బిడ్డ‌తో ఎక్కిన ఆ అమ్మ‌ను చూసిన ఒక్క‌రు కూడా ఆమెకు సీటు ఇవ్వ‌లేదు. మ‌న‌కెందుకు అన్న‌ట్లు సెల్‌ఫోన్లు చూసుకుంటూ, ప‌క్క‌నున్న వారితో ముచ్చ‌ట్లు చెప్ప‌కుంటూ ఉన్నారు. ఎవ‌రినైనా సీటు అడుగుదాం అనుకుంటే.. ఎవ‌రు ఎలా స్పందిస్తారోన‌న్న భ‌యంతో ఆ మ‌హిళ మిన్నుకుండిపోయింది. రైలు ప్ర‌యాణిస్తుండ‌డంతో ఎక్కువ సేపు నిలుచోలేక కింద కూర్చుని.. ఒడిలో బిడ్డ‌ను పెట్టుకుని త‌న గ‌మ్య‌స్థానం వ‌ర‌కు ప్ర‌యాణించింది. మెట్రో రైలులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను ఎవ‌రో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయి మండిపడ్డారు.

Next Story