తెలంగాణ‌లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల

TSPSC notifies 1,392 junior lecturer posts. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నియంత్రణలో ఉన్న 1,392 జూనియర్ లెక్చరర్ల నియామకానికి

By Medi Samrat  Published on  9 Dec 2022 2:45 PM GMT
తెలంగాణ‌లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల

ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నియంత్రణలో ఉన్న 1,392 జూనియర్ లెక్చరర్ల నియామకానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం నోటిఫై చేసిన వాటిలో 724 పోస్టులు మల్టీ-జోన్ I కింద, 668 మల్టీ-జోన్ IIలో ఉన్నాయి. గణితంలో 154, ఇంగ్లీషులో 153, జువాలజీలో 128, హిందీలో 117, బోటనీ, కెమిస్ట్రీలో ఒక్కొక్క దానిలో 113 సహా 27 విభిన్న సబ్జెక్టుల్లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

రిక్రూట్‌మెంట్ పరీక్ష జూన్/జూలై 2023 నెలలో నిర్వహించే అవకాశం ఉంది. అర్హత గల అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉంచబడే ప్రొఫార్మా అప్లికేషన్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ డిసెంబర్ 16 నుండి జనవరి 6, 2023 తేదీ వరకు చేసుకునే అవ‌కాశం ఉంది.


Next Story