తెలంగాణను చీకట్లోకి నెట్టేందుకు కేంద్రం కుట్ర: మంత్రి జగదీష్ రెడ్డి
TS Minister Jagdish Reddy fire on central government. తెలంగాణలో కరెంట్ బకాయిల వివాదం వేడి రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలకు 6,756 కోట్ల రూపాయల
By అంజి Published on 30 Aug 2022 12:35 PM ISTతెలంగాణలో కరెంట్ బకాయిల వివాదం వేడి రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలకు 6,756 కోట్ల రూపాయల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ డిస్కమ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఇంధన శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇది ముముమ్మాటికి దేశద్రోహపూరిత చర్యేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవరిస్తోందన్నారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర అని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ లేఖలను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వం పగబట్టి రాష్ట్రంలోని విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు పెండింగ్‌లో ఉన్న రూ.12,900 కోట్ల బకాయిలను ఏపీ చెల్లించేలా దిశానిర్దేశం చేసేందుకు కేంద్రం ఎందుకు చొరవ చూపడం లేదని మండిపడ్డారు. ఎన్నిసార్లు కేంద్రానికి మోర పెట్టుకున్నా స్పందించలేదన్నారు. ఒక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)లో, బకాయిల్లో తెలంగాణకు ఏపీ నష్టం చేకూరుస్తోందని ఆరోపించారు.
2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో వెలుగులు నింపుతామన్న మాట కేంద్రానికి దక్కేలా లేదన్నారు. గుజరాత్‌తో సహా అన్ని రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కాకుండా అన్ని రాష్ట్రాల రాజధానులు, దేశ రాజధానిలో కరెంటు కోతలు ఎదుర్కొంటున్నారని, విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సాధించిన విజయాన్ని జీర్ణించుకోలేక బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎటువంటి విద్యుత్ కోతలు లేనిది ఒక్క తెలంగాణ రాష్ట్రామేనని వ్యాఖ్యానించారు.