కోవిడ్‌-19 కమ్యూనిటీ వ్యాప్తి అంచనాపై.. రేపటి నుండి తెలంగాణ వ్యాప్తంగా సర్వే

TS Govt, ICMR to start state-wide Covid-19 survey to assess extent of community spread. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, తెలంగాణ ప్రభుత్వం జనవరి 4, మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా

By అంజి  Published on  3 Jan 2022 1:04 PM GMT
కోవిడ్‌-19 కమ్యూనిటీ వ్యాప్తి అంచనాపై.. రేపటి నుండి తెలంగాణ వ్యాప్తంగా సర్వే

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, తెలంగాణ ప్రభుత్వం జనవరి 4, మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ -19 సర్వేను ప్రారంభించనున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని సాధారణ జనాభా, ఆరోగ్య కార్యకర్తల మధ్య ఈ సర్వే నిర్వహించబడుతుంది. రాష్ట్రంలో అంటువ్యాధి యొక్క కమ్యూనిటీ వ్యాప్తిని అంచనా వేయడం ఈ సర్వే లక్ష్యం. జిల్లాల్లోని సాధారణ జనాభా, హెల్త్ కేర్ వర్కర్స్ నుండి సేకరించే రక్త నమూనాలలో సార్స్‌ కోవ్‌-2, యాంటీబాడీలను పరిశీలించడం ద్వారా సెరోప్రెవలెన్స్ అంచనా వేయబడుతుంది.

ఈ సర్వేలో దాదాపు 16,000 మందిని కవర్ చేయనున్నారు. 33 జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి 10 గ్రామాలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి, ఒక్కో గ్రామం నుంచి 6 ఏళ్లు పైబడిన 40 మంది పురుషులు, మహిళలు సర్వే పరిధిలోకి వస్తారు. 20కి పైగా బృందాలు, ఒక్కొక్కటి శాస్త్రవేత్త/డాక్టర్, టెక్నీషియన్, ఫ్లేబోటోమిస్ట్, నలుగురు కోఆర్డినేటర్‌లు, ఎన్‌ఐఎన్‌ నుండి ఒక ప్రధాన శాస్త్రవేత్తతో కలిసి రాష్ట్ర ఆరోగ్య శాఖతో కలిసి పని చేసి దాదాపు 3 వారాల్లో సర్వేను పూర్తి చేస్తారు. "అంతేకాకుండా అన్ని జిల్లాల్లోని ఆరోగ్య కార్యకర్తల నుండి నమూనాలు, డేటా కూడా సేకరిస్తారు" అని ఐసీఎమ్‌ఆర్‌ - ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్ డాక్టర్ హేమలత ఆర్ చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఇతర పరిపాలనా విభాగాలు ఇంటింటికి సర్వేలో ఐసీఎమ్‌ఆర్‌ - ఎన్‌ఐఎన్‌తో సహకరిస్తాయి.

Next Story
Share it