ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ఇంటిపై దాడి

TRS Workers attacked MP Arvind house.ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్‌ పార్టీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2022 7:44 AM GMT
ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ఇంటిపై దాడి

భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నాయ‌కుడు, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ఇంటిపై తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌) పార్టీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఎమ్మెల్సీ క‌విత‌పై ఎంపీ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు.


హైద‌రాబాద్‌లోని ఎంపీ నివాసాన్ని ముట్ట‌డించిన టీఆర్ఎస్, జాగృతి నేత‌లు ఇంట్లోని అద్దాలు, ఫ‌ర్నీచ‌ర్‌ను, ఇంటి ఆవ‌ర‌ణ‌లోని ఉన్న పూల కుండీల‌ను ధ్వంసం చేశారు. అర్వింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా.. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఎంపీ అర్వింద్ ఇంట్లో లేరు. నిజామాబాద్‌లో క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన దిశ స‌మావేశంలో ఉన్నారు. ఎంపీ ఇంటి పై దాడి నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద పోలీసులు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

మా అమ్మ‌ను బెదిరించారు.. ఎంపీ ట్వీట్‌

''కేసీఆర్, కేటీఆర్, కవితల ఆదేశాలపై హైదరాబాద్‌లోని నా ఇంటిపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ... బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు'' అంటూ ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.


Next Story