ధాన్యం కొనేవరకు ధర్నాలు.. పిలుపునిచ్చిన కేటీఆర్‌

TRS party called protest from friday. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌

By అంజి  Published on  10 Nov 2021 12:18 PM IST
ధాన్యం కొనేవరకు ధర్నాలు.. పిలుపునిచ్చిన కేటీఆర్‌

తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల నేపథ్యంలో.. ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తీసుకుని ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని, పార్టీ నేతలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సూచించారు.

తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొంటుందా? లేదా? అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నుండి అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు నిర్వహిస్తామన్నారు. లక్షలాది మంది రైతులతో కలిసి పోరాడుతామన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దొంగ మాటలు మాని వరి ధాన్యంపై మాట్లాడాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇదే సందర్భంలో యాసంగిలో వరి పంట వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్. రైతుల మంచి కోసం చెబుతున్నానని, బీజేపీ నాయకుల మాటలు వింటే ఆగమైపోతారని హెచ్చరించారు. సీడ్ కంపెనీతో, మిల్లర్లతో ఒప్పందం ఉన్నవారు వరి పండించుకోచ్చన్నారు.

Next Story