మోడీ సర్కార్‌పై యుద్ధమే.. టీఆర్ఎస్ ఎంపీల హెచ్చ‌రిక‌

TRS MPs protest against central government. కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని పదవి నుండి మోడీ దిగిపోతేనే దేశ రైతన్నలకు న్యాయం

By అంజి  Published on  7 Dec 2021 2:16 PM IST
మోడీ సర్కార్‌పై యుద్ధమే.. టీఆర్ఎస్ ఎంపీల హెచ్చ‌రిక‌

కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని పదవి నుండి మోడీ దిగిపోతేనే దేశ రైతన్నలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వంపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని టీఆర్‌ఎస్‌ ఎంపీలు తేల్చి చెప్పారు. ఇదే నినాదంతో ముందుకెళ్తామన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఇవాళ కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉభయ సభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. లోక్‌స‌భ‌లో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద ఎంపీలు ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం సేక‌ర‌ణ‌, విప‌క్ష ఎంపీల స‌స్పెన్ష‌న్ త‌దిత‌ర అంశాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా పార్లమెంట్‌ను సమావేశాలను బహిష్కరించారు.

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఉభ‌య‌స‌భ‌ల‌కు చెందిన టీఆర్ఎస్ స‌భ్యులు 16 మంది నిర‌స‌న ప్ర‌ద‌ర్శన చేప‌ట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీ కే కేశవరావు మాట్లాడారు. ప్రధాని మోడీది ఫాసిస్ట్‌ ప్రభుత్వం అని, ప్రజలను బీజేపీ తిరుగుబాటు చేసేలా సమాయత్తం చేస్తామని అన్నారు. తమ ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. సభను బాయ్‌కాట్‌ చేయాలని ఎవరూ కోరుకోరని, కేంద్ర వైఖరికి నిరసనగానే బాయ్‌కాట్‌ చేస్తున్నామని ఎంపీ కే కేశవరావు తెలిపారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. పార్లమెంట్‌ జరిగినన్ని రోజులు ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించాలని తీర్మానించారు.


Next Story