కొన్ని బంధాలు చాలా ప్రత్యేకం.. సీఎం ఇంట రాఖీ వేడుకలు
TRS MLC Kavitha ties rakhi to brother KTR. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇంట రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి
By Medi Samrat
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇంట రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ కుమార్తె, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం రక్షా బంధన్‌ను పురస్కరించుకుని రాఖీ కట్టారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో తెలంగాణ శాసనమండలి సభ్యురాలు కవిత తన సోదరుడికి రాఖీ కట్టారు. వేడుకలలో తల్లి శోభ, కేటీఆర్ భార్య శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కేటీఆర్ గత నెలలో ఇంట్లో పడిపోయిన కారణంగా కాలికి స్వల్ప గాయం అయ్యింది. గాయం నుండి ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయనను మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా అన్నచెల్లెలి బంధానికి సంబంధించిన కొన్ని పాత ఫొటోలను కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Some bonds are so special 😊#HappyRakhi #HappyRakshabandan pic.twitter.com/9WPibLeQMi
— KTR (@KTRTRS) August 12, 2022
"కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి" అని ఆయన ట్వీట్ చేశారు. మంత్రి కవితతో చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేశారు. అలాగే కేటీఆర్ కుమార్తె, కొడుకు రక్షా బంధన్ జరుపుకున్న పాత ఫోటోను కూడా షేర్ చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) మహిళా నేతలు పలువురు రాష్ట్ర మంత్రులకు రాఖీలు కట్టి పండుగ జరుపుకున్నారు. బ్రహ్మకుమారీలు మంత్రులు కొప్పుల ఈశ్వర్, దయాకర్ రావులను కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరగనున్న అంతర్జాతీయ యోగా సదస్సుకు మంత్రులను ఆహ్వానించారు.