కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేటలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ చేస్తున్న పని రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా అన్న చందంగా ఉంది. బయటి లీడర్లను తీసుకువచ్చి రాజకీయం చేయడం బీజేపీ పని అని విమర్శించారు. బీజేపీలో చేరకపోతే ఈడీ, ఐటీ లతో కేసులు పెట్టి బెదిరిస్తున్నారని అన్నారు. నెల రోజుల నుండి మంత్రులను, ఎమ్మెల్యేలను వదలకుండా రైడ్ చేస్తున్నారని మండిపడ్డారు.
మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.. తెలంగాణ వాళ్లు భయపడే వాళ్లు కాదని.. వ్యాపారం లీగల్ గా చేసుకుంటారు.. అధికారులు అడిగితే సమాధానం చెబుతారని అన్నారు. ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బిఎల్ సంతోష్ పేరు వచ్చింది.. కాబట్టి విచారణకు పిలిచారు.. పిలిస్తేనే ఎంత భయం.. పది కేసులు వేశారు.. ఇక్కడ దొరికిన దొంగల మీద విచారణ చేయోద్దనా..? అని ప్రశ్నించారు.
బండి సంజయ్ యాదగిరి గుట్టకు వెళ్లి దొంగ ప్రమాణాలు చేసారని విమర్శించారు. నిన్న కూడ ఎందుకు ఏడ్చాడో తెలియదు.. అడ్డంగా దోరికిన బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయోద్దు అని కోర్టుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. విచారణకు హాజరవమని కోర్టు చెప్పింది. కాని విచారణ కూడా రానని మళ్లీ కోర్టుకు వెళ్లారని అన్నారు. టీఆర్ఎస్ మంత్రులు ఏ ఏజెన్సీ కైనా సహకరిస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలు రాముని పేరు చెప్పి రౌడీయిజం చేయాలయని చూస్తున్నారని.. ఏ ఏజెన్సీని వేసినా ఏ సమస్య లేదని కల్వకుంట్ల కవిత అన్నారు.