బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్ మంగళవారం తన 13వ రోజు ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశాంత్ కిషోర్ ద్వారా ఇరువర్గాలు రహస్య ఒప్పందం చేసుకుంటున్నాయని అన్నారు. ప్రశాంత్ కిషోర్ మధ్యాహ్న భోజనానికి కాంగ్రెస్ హైకమాండ్‌తో కలిశారని, ఆ తర్వాత కేసీఆర్‌తో కలిసి ప్రగతి భవన్‌లో డిన్నర్‌కు వచ్చారని ఆరోపించారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నా పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు డీల్ కుదుర్చుకున్నాయని, ఆ రెండు పార్టీలు ఒకటేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రెండు పార్టీలకు పని చేస్తారన్న వార్తల నేపథ్యంలో లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు రెండూ ఒక్కటే కాబట్టి రెండు పార్టీల రాజకీయ వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు పీకేతో కలిసి మాట మార్చారని ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునేలా పీకే వ్యూహాలు రచిస్తున్నారని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల పొత్తు కూడా పీకే ప్లాన్‌లో భాగమేనన్నారు.