అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి చెందగా ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు. ఉట్నూర్ మండలంలోని రాజులమడుగు గ్రామానికి చెందిన కొడప లక్ష్మణ్ అనే గిరిజనుడు అడవి పంది దాడి చేయగా మృతి చెందాడు. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం 10లక్షల రూపాయల చెక్కును అందించింది. మృతుని భార్య లక్ష్మీకి ఆ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బిర్సాయి పేట్ ఎఫ్ఆర్వో అరుణ, ఫారెస్ట్ అధికారులు సీతారాం తదితరులు ఉన్నారు.