రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మంత్రి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, పోలీస్ మరియు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ప్రమాద పరిణామాలను సమీక్షించారు. గాయపడిన వారికి తక్షణం అత్యవసర వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, తీవ్రమైన గాయాలపాలైన వారిని వెంటనే హైదరాబాద్‌కు తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంత్రి ఆర్టీసీ అధికారులు, రవాణా కమిషనర్, ఫైర్ సర్వీస్ డీజీలను ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన అంశాలపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రయాణికుల ప్రాణ రక్షణ అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ మరియు ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంత్రి హృదయపూర్వక సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు: 9912919545, 9440854433. ప్రయా