తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను వివిధ శాఖల్లోకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Medi Samrat  Published on  3 Aug 2024 5:19 PM IST
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను వివిధ శాఖల్లోకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఆగస్టు 3వ తేదీ శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ రవాణా, గృహనిర్మాణం & సాధారణ పరిపాలన శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్‌ను ప్రభుత్వం, రోడ్లు మరియు భవనాల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు. కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా హరీష్, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పురపాలకశాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక, హెచ్‌ఏసీఏ ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డిని నియమించారు. మార్కెట్‌ ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యారు.

Next Story