ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత

Tragedy in Jogulamba Gadwala district. జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. ఇటిక్యాల మండలం మంగపేట వద్ద కృష్ణా నదిలో ఒకే కుటుంబానికి చెందిన

By Medi Samrat  Published on  5 Jun 2023 7:58 PM IST
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. ఇటిక్యాల మండలం మంగపేట వద్ద కృష్ణా నదిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. మంగంపేటలోని కృష్ణా నది చూసేందుకు సోమవారం చిన్నారులు అక్కడికి వెళ్లారు. ఈత కొట్టేందుకు నలుగురు చిన్నారులు నదిలో దిగారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన చిన్నారులు నదిలో గల్లంతయ్యారు. గల్లంతైన చిన్నారుల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతులను ఆఫ్రిన్‌ (17), రిహాన్‌ (15), సమీర్‌ (8), నౌసిన్‌ (7) అని పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

ఆలంపూర్ నియోజవకర్గంలో కృష్ణా నదిని చూసేందుకు 11 మంది ఆటోలో వెళ్లారు. ఇటిక్యాల మండలం మంగంపేట వద్ద చిన్నారులు కృష్ణా నదిలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు మునిగిపోయారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు నది వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు.


Next Story