అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు

కేటీఆర్ ట్వీట్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. అధికారం కోల్పోయాక తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ విమర్శలు చేస్తున్నార‌ని అన్నారు

By Medi Samrat  Published on  22 Oct 2024 2:43 PM IST
అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు

కేటీఆర్ ట్వీట్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. అధికారం కోల్పోయాక తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ విమర్శలు చేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్ర ఆదాయం ఏ అంశాల్లో తగ్గిపోయిందో కేటీఆర్ చెప్పాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని.. ఆ అప్పుకు రాష్ట్ర రాబడిలో 60 శాతం వడ్డీ కట్టడానికి సరిపోతుందన్నారు. ఇబ్బడి ముబ్బడిగా తీసుకొచ్చిన అప్పులతో ప్రజలపై భారం పడుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వయాబుల్ కాదని తెలిసినా రూ. 1.20 వేల కోట్లు ఖర్చు చేసింది ఆనాటి ప్రభుత్వం.. బీఆర్ఎస్ పాలనలో అవసరం లేని చోట్ల కూడా బడ్జెట్లు పెట్టి తద్వారా కమిషన్లు దోచుకున్నారు.. దీనివల్ల కేసీఆర్ కుటుంబం తప్ప తెలంగాణలో ఏ కుటుంబం బాగుపడలేదన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన జరుగుతుంది. హైడ్రా కూల్చివేతల్లో మీ ఎమ్మెల్యేలు కబ్జాలు చేశారనే విమర్శలు చేస్తున్నారా.? కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు కాంగ్రెస్ పార్టీ నేత అయినా వారి కట్టడాలు కూల్చివేశామ‌ని ఉద‌హ‌రించారు. హైడ్రాకి తన, మన భేదాలు ఉండవని.. ఎవరి కట్టడాలు అక్రమంగా ఉన్న కూల్చివేయడమే ప్రధాన ఎజెండా అని స్ప‌ష్టం చేశారు.

Next Story