అబద్ధాలకు కేసీఆర్ అంబాసిడర్ అని.. నిలువునా మోసం చేయడంలో దిట్ట అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దళిత సీఎం, ఇంటికో ఉద్యగం, గిరిజన రిజర్వేషన్, నిరుద్యోగ భృతి, హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం దళితబంధు, మునుగోడు కోసం గోర్ల పంపిణి అంటూ మోసం చేశారని అన్నారు. మునుగోడులో గోర్లకు బదులు డబ్బులు వేసి.. 33 వేల మంది అకౌంట్స్ ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. ఎన్నికలు అయ్యే వరకు ఒకమాట, తర్వాత మరో మాట అని దుయ్యబట్టారు.
రుణమాఫీ, ఉచిత ఎరువులు అని కేసీఆర్ మోసం చేశారని అన్నారు. వందల వాగ్దానాలు చేసి వదిలేసిండని విమర్శించారు. బడ్జెట్ ప్లానింగ్ లేకుండా చేయడం కేసీఆర్ కే చెల్లుతుందని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కరించలే, ఉద్యోగులకు డీఏలు ఇయ్యలేదని ఎండగట్టారు. మళ్లీ అధికారంలోకి రావడానికి కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లకు తాయిలాలు ఇస్తున్నారని ఆరోపించారు.
ఫక్తు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ ముందుంటారని అన్నారు. టీఆర్ఎస్ ఐపోయింది అని.. బిఆర్ఎస్ పెట్టారు.. ఆంధ్ర నాయకులను ఆహ్వానిస్తున్నారు. బీజేపీ డైరెక్షన్ మేరకే కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని అన్నారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆస్తులు పెంచుకోడానికే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు.