ఆయ‌న రథయాత్ర చేయకపొతే బీజేపీ ఎక్కడిది..? : జగ్గారెడ్డి

బండి సంజయ్ రాహుల్ గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్య‌ల‌పై జగ్గా రెడ్డి స్పందించారు.

By Medi Samrat  Published on  16 Feb 2025 2:09 PM IST
ఆయ‌న రథయాత్ర చేయకపొతే బీజేపీ ఎక్కడిది..? : జగ్గారెడ్డి

బండి సంజయ్ రాహుల్ గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్య‌ల‌పై జగ్గా రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయ‌న మాట్లాడుతూ.. బండి సంజయ్.. రాహుల్ గాంధీ కుటుంబంపై కొన్ని ప్రశ్నలు వేశారు.. బండి సంజయ్‌కు అవగాహన కలిగేలా కొన్ని విషయాలు చెబుతా.. స్వతంత్ర సంగ్రామం నుంచి వచ్చిందే.. రాహుల్ గాంధీ ఫ్యామిలీ.. బండి సంజ‌య్‌ ఇందిరా గాంధీ, సోనియా గాంధీ గురించి అవగాహన లేక మాట్లాడిండు.. రాహుల్ గాంధీ కుటుంబం.. హిందూ బ్రాహ్మణ వర్గానికి చెందినది.. బ్రాహ్మణులు హిందువులు కాదా.. బండి సంజ‌య్‌కి తెల్వదా అని ప్ర‌శ్నించారు.

రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడు.. రాజకీయాలకు కులం, మతం వాడలేదన్నారు. సోనియా గాంధీ.. క్రిస్టియన్ కాదా అంటున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం.. సోనియా.. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత అదే వర్తిస్తుందన్నారు. నేను రెడ్డి.. నా భార్య గౌడ్.. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యను రెడ్డిగానే పిలుస్తున్నారన్నారు.

ఇందిరా.. ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది.. ఇందిరా భర్త.. ఫిరోజ్ జర్నలిస్ట్.. నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవస్థపకుడు, స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేశాడు. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఎప్పుడు కుల, మతాలను రాజకీయాలకు వాడుకోలేదన్నారు. మోతీలాల్ నుంచి నేటి రాహుల్ వరకు ప్రతీ తరం త్యాగం చేసిందన్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం రాహుల్ ది అన్నారు.

యూపీఏ హయాంలో సోనియా, రాహుల్ ఇద్దరూ పదవులు తీసుకోకుండా పరిపాలన ముఖ్యం అని పని చేశారు. ఎల్‌కే అద్వానీని ఎందుకు పక్కన పెట్టారని మోదీని బండి సంజయ్ అడుగుతారా..? అని ప్ర‌శ్నించారు. అద్వానీ రథయాత్ర చేయకపొతే బీజేపీ ఎక్కడిది..? అద్వానీ పుణ్యమా అని ఇంత స్థాయికి వచ్చామనే కృతజ్ఞత లేదు.. పోస్ట్‌ల కోసం పాకులాడే మీరు.. రాహుల్, సోనియా ల గురించి మాట్లాడుతారా..? అని మండిప‌డ్డారు. రాహుల్, సోనియా త్యాగాల ముందు మీరు ఎంత..? రాహుల్, సోనియా కుటుంబం గురించి వేలెత్తి చూపే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు.

Next Story