ఎవరు పార్టీలోకి రావాలని అనుకున్నా కండువా కప్పేస్తాం : జగ్గారెడ్డి

పార్టీ అభ్యర్థికి నష్టం చేసినవాళ్ళు అయినా.. చేర్చుకోవాలని ఏఐసీసీ నిర్ణయించింద‌ని.. నాయకులు ఎవరు నారాజ్ కావద్దు..కలిసి పని చేయాల్సిందేన‌ని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  25 April 2024 4:30 PM IST
ఎవరు పార్టీలోకి రావాలని అనుకున్నా కండువా కప్పేస్తాం : జగ్గారెడ్డి

పార్టీ అభ్యర్థికి నష్టం చేసినవాళ్ళు అయినా.. చేర్చుకోవాలని ఏఐసీసీ నిర్ణయించింద‌ని.. నాయకులు ఎవరు నారాజ్ కావద్దు..కలిసి పని చేయాల్సిందేన‌ని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు వచ్చి చేరినా నేను అభ్యంత‌రం చెప్పనన్నారు. ఎన్నికల వరకు పార్టీలో పని చేసి.. ఎన్నికల సమయంలో కొందరు బయటకు వెళ్లారు.. వాళ్ళందరి విషయంలో పార్టీ తిరిగి చేర్చుకోవాలని ఏఐసీసీ పీసీసీని ఆదేశించిందన్నారు.

బీఆర్ఎస్‌ నుండి ఎవరు వచ్చినా చేర్చుకోండి అని ఆదేశాలు ఉన్నాయన్నారు. ఎవరు పార్టీలోకి రావాలని అనుకున్నా కండువా కప్పేస్తామ‌న్నారు. కండిషన్ తో చేరికలు ఉండవన్నారు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళ తో కొంత స్థానిక నాయకులకు ఇబ్బంది ఉంటదన్నారు. నా దగ్గర నాకు వ్యతిరేకంగా కొందరు పని చేశారు.. వాళ్ళతో ఓడిపోయిన.. ఎందుకు చేర్చుకోవాలి అని నాకు కోపం ఉంటది.. కానీ పార్టీ.. ఆదేశించింది కాబట్టి కండువా కప్పాల్సిందేన‌న్నారు. పార్టీలో చేరినా.. వాళ్ళు కాంగ్రెస్ ఇంఛార్జ్‌ల‌.. ఎమ్మెల్యేల‌ కిందనే పని చేయాలని పార్టీ ఆదేశించింద‌ని అన్నారు. పార్టీలోకి చేరే వాళ్లంతా డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. జవాబుదారీగా చేరికలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఓడిపోయినా వాళ్ళు నారాజ్ కావద్దన్నారు. మీడియాకు ఎక్కోద్దు.. ఇది అధిష్టానం ఆదేశం.. అందరూ కలిసి పని చేయాల్సిందేన‌న్నారు.

Next Story