బీజేపీ నాయ‌కులు గుడులు, గోపురాలు తిరగ‌డం త‌ప్ప చేసేది ఏమీలేదు : జగ్గారెడ్డి

ఐటీఐఆర్ కోసం ఆనాడు యూపీఏ ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చిందని.. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  21 Jun 2024 6:45 PM IST
బీజేపీ నాయ‌కులు గుడులు, గోపురాలు తిరగ‌డం త‌ప్ప చేసేది ఏమీలేదు : జగ్గారెడ్డి

ఐటీఐఆర్ కోసం ఆనాడు యూపీఏ ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చిందని.. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న బీజేపీ నేతలు ఏనాడు ఐటీఐఆర్ పై చర్చ చేయలేదన్నారు. ఐటీఐఆర్ వస్తే ఈ పది ఏండ్లలో 15 లక్షల మందికి అవకాశం వచ్చేదని అన్నారు.

రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి యువతను ఆకర్షించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడు చూసినా గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు తప్ప చేసేది ఏమీలేదన్నారు. హైదరాబాద్ సేఫ్ జోన్ ప్రాంతం అని అప్పుడు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఐటీ ఐఆర్ తెచ్చారన్నారు. ఈ పది ఏండ్లు టైం ను కిషన్ రెడ్డి, దత్తాత్రేయలు కిల్ చేశార‌ని.. తెలంగాణలో ఉన్న 4 కోట్లలో 50 లక్షల మందికి వెసులు బాటు కలిగేదని.. కుల వృత్తుల వాళ్ళకి కూడా ఉపాధి దొరికేది.. ఈ జ్ఞానాన్ని ఎందుకు బీజేపీ వాళ్ళు తెలుసుకోట్లేదని విమ‌ర్శించారు.

Next Story