కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై రాష్ట్రంలో హర్షం వ్యక్తం అవుతోంది

రాష్ట్రంలో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ్టికి ఐదు రోజులు అయ్యింద‌ని.. ఈ ఐదు రోజులు ప్రభుత్వం పనితీరుపై

By Medi Samrat  Published on  12 Dec 2023 9:38 AM GMT
కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై రాష్ట్రంలో హర్షం వ్యక్తం అవుతోంది

రాష్ట్రంలో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ్టికి ఐదు రోజులు అయ్యింద‌ని.. ఈ ఐదు రోజులు ప్రభుత్వం పనితీరుపై రాష్ట్రంలో హర్షం వ్యక్తం అవుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి రావటం తోటే ఆరు గ్యారెంటీ లల్లో 2 గ్యారెంటీలు అమలు చేశారు.. ఇందిరమ్మ రాజ్యానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచటంతో సామాన్య మానవునికి భరోసా ఏర్పడింద‌న్నారు.

భ‌ట్టి విక్రమార్కు ఆర్ధిక మంత్రిగా.. ఆర్ధిక శాఖ స్థితిగతులు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్న ప్రకారం రుణమాఫీ, రైతు బంధు జరుగుతుంద‌న్నారు. దశల వారిగా.. ప్రకటించిన హామీలు అమలు చేస్తామ‌న్నారు. కాళేశ్వరం మేడిగడ్డ పిల్లరు కుంగితే బీఆర్ఎస్ ఏం చర్యలు తీసుకోలేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించి ప్రజలకు అసలు విషయాలు తెలియజేస్తారని తెలిపారు.

ప్రశ్న పత్రాల లీకు విషయంలో బీఆర్ఎస్ ఏం చర్యలు తీసుకోలేదన్నారు. నిన్న చూసాం.. జనార్దన్ రెడ్డి రేజీనామా చేశారు. TSPSC పూర్తిగా ప్రక్షాళన చేసే పని రాష్ట్రం ప్రభుత్వానికి ఉందన్నారు. కేవలం 5 రోజులు పాలనలో గుణాత్మక మార్పు కొట్టొచ్చిన్నటు కనపడుతుందన్నారు. ప్రజలు దీనిని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.

6G ఫేక్ గ్యారెంటీ కార్డ్ లు దళారులు అమ్ముకుంటున్నారు.. కాంగ్రెస్ కార్యకర్తలు గమనించాలి.. ప్రజలను ఫేక్ కార్డ్ తో మోసం చేసే వారిపై కేసులు పెట్టాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రకటించిన విధంగా 100 రోజుల్లో హ‌మీల‌ అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం తరుపునే అన్ని సౌకర్యాలు కలుగుతాయి.. దళారులను నమ్మకండ‌న్నారు. అనుమానం ఎవరికైనా ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇన్‌ఫార్మ్‌ చెయ్యండన్నారు. మీ సేవా సెంటర్ వాళ్ళకు చెప్తున్నాము.. ఫేక్ కార్డ్ ప్రింట్ చేస్తే.. మీ ఆన్లైన్ సెంటర్ ప‌ర్మినెంట్‌గా క్లోజ్ అవుతాయ‌ని హెచ్చ‌రించారు.

Next Story