ఇలాంటి దుర్మార్గులను గెలిపిస్తే సమాజం బతుకదు : రేవంత్

TPCC Revanth Reddy Fire On Rajagopal Reddy. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం అన్యాయం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

By Medi Samrat
Published on : 10 Oct 2022 8:15 PM IST

ఇలాంటి దుర్మార్గులను గెలిపిస్తే సమాజం బతుకదు : రేవంత్

రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం అన్యాయం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ‌ ఉప ఎన్నిక ప్ర‌చారంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించినందుకా..? చెట్టంత మనిషిని చేస్తే.. ఆయన కాంగ్రెస్ ను చంపుతానంటూ తిరుగుతున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దుష్మన్ తో దోస్తీ చేసి 22వేల కోట్లకు అమ్ముడుపోయాడని విమ‌ర్శించారు. ఇలాంటి దుర్మార్గులను గెలిపిస్తే సమాజం బతకదని అన్నారు.

సమాజం బతకాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. మునుగోడు జూనియర్ కాలేజీ, చండూరులో డిగ్రీ కాలేజీ ఇస్తామన్న కేసీఆర్ ఏమీ చేయలేదని అన్నారు. ఏం వెలగబెట్టారని కేసీఆర్ మునుగొడులో ఓట్లు అడగడానికి వస్తుండని ఫైర్ అయ్యారు. మోరీలో తట్టెడు మట్టి పోయలేని సన్నాసి ఓట్లు అడుగుతాడా.. అని నిప్పులు చెరిగారు. ఒక్కసారి మీ ఆడబిడ్డకు అవకాశం ఇవ్వండని.. ఎవరు ఎక్కడ పోయినా ఈ అడబిడ్డను ఆశీర్వదించండని పాల్వాయి స్ర‌వంతి త‌రుపున ఓటును అభ్య‌ర్ధించారు.




Next Story