నేతలకు ఫిరాయింపుల రోగం వచ్చింది

TPCC Revanth Reddy Fire On Komatireddy Rajagopal Reddy. పార్టీలు ఫిరాయించే ఈ కాలంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్న కాంగ్రెస్ శ్రేణుల‌కు

By Medi Samrat  Published on  13 Sep 2022 2:03 PM GMT
నేతలకు ఫిరాయింపుల రోగం వచ్చింది

పార్టీలు ఫిరాయించే ఈ కాలంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్న కాంగ్రెస్ శ్రేణుల‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభినందనలు తెలియ‌జేశారు. చౌటుప్పల్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో పలువురు చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్ హయాంలో నేతలకు ఫిరాయింపుల రోగం వచ్చిందని విమ‌ర్శించారు. నల్లగొండ జిల్లా చైతన్యానికి మారుపేరు.. పోరాటాలకు స్ఫూర్తి అని అన్నారు. పేదలకు సేవచేసిన ఎందరో మహా నేతలను అందించిన జిల్లా న‌ల్గొండ జిల్లా అని రేవంత్ అన్నారు.

గతంలో ఈ జిల్లాకు చెందిన గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి పార్టీ ఫిరాయించారని.. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎందుకు పార్టీ ఫిరాయించారు? కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదా? ఇవ్వనందా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మునుగోడు నియోజకవర్గంలో నాయకులమంతా గడపగడపకు తిరుగుదామ‌ని పిలుపునిచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉంద‌ని అన్నారు. కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన పనిలేదని.. ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే.. వాళ్ళ మెడలు వంచుతాం అని రేవంత్ హెచ్చ‌రించారు.


Next Story
Share it