ఇప్పటికైనా కేసీఆర్ సర్వే రిపోర్ట్ బయట పెట్టాలి
TPCC President Revanth Reddy. కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరా భవన్లో
By Medi Samrat
కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరా భవన్లో బీసీ జన ఘనన అంశంపైన టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని అన్నారు. దేశంలో అన్ని కులాల లెక్కలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ జనాభా లెక్కలు ప్రభుత్వం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.
మోదీ వన్ నేషన్ వన్ సెన్సెక్స్ ను ఎందుకు తీసురావడం లేదని.. మోదీ సర్కార్ జన గణన చేయకపోవడం వెనుక మతలబు ఏంటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గతంలో సమర్థవంతంగా పరిపాలన చేసింది కాబట్టే.. దేశంలో అన్ని వర్గాలు, మతాలు, కులాలు కలిసి జీవించగలుగుతున్నాయని అన్నారు. జనాభా లెక్కలు తెలిస్తేనే బిసీ లకు రాజకీయ ప్రాతినిథ్యం పెరుగుతుందని అన్నారు. బీసీ ఓట్లు లేకుండా ఎవరు చట్టసభల్లో అడుగుపెట్టడం లేదని.. బీసీలు తమ జనాభా లెక్కలు చేయమని అడగడంతో న్యాయం ఉందని అన్నారు. బిసిలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ బిసిల వెంట ఉండి పోరాడుతుందని అన్నారు.
రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అని.. అధికారంలోకి వచ్చాక బిసిలకు ఎలా న్యాయం చేయాలనే యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ ఎందుకు బయట పెట్టడం లేదని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని సందేహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బిసీ సంఘాలు చేసే అన్ని ఉద్యమాలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.