షేర్ మార్కెట్ కంటే వేగంగా మునుగోడులో పార్టీ ఫిరాయింపులు

TPCC President, MP Revanth Reddy. ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ కు కార్యక్రమాలకు మంచి స్పందన ఉండేదని టీపీసీసీ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  12 Oct 2022 12:15 PM GMT
షేర్ మార్కెట్ కంటే వేగంగా మునుగోడులో పార్టీ ఫిరాయింపులు

ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ కు కార్యక్రమాలకు మంచి స్పందన ఉండేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణలో సమస్యలపై పోరాడేందుకు యూత్ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. షేర్ మార్కెట్ కంటే వేగంగా మునుగోడులో పార్టీ పిరాయింపులు జరుగుతున్నాయని.. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులపై ఉందని అన్నారు.

ఫిరాయింపు రాజకీయాలను పాతరేయాలంటే అది యూత్ కాంగ్రెస్ తోనే సాధ్యమ‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చంపాలనే టీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ పై ఉందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు వేదిక కాంగ్రెస్.. ఈ వేదికను లేకుండా చేసేందుకు.. కాంగ్రెస్ పార్టీని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. దళిత, బహుజనులు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా..? కలలో కూడా కేసీఆర్ అలాంటి ఆలోచన రానివ్వడని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశంలో, రాష్ట్రంలో పేదలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి.. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.


Next Story
Share it