ఆ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆరే : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ కి శిక్ష తప్పదు. కేటీఆర్ శిక్ష అనుభవించాల్సిందేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on  14 Nov 2024 2:42 PM IST
ఆ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆరే : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ కి శిక్ష తప్పదు. కేటీఆర్ శిక్ష అనుభవించాల్సిందేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వికారాబాద్ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్ అని అన్నారు. ఈ- ఫార్ములా విషయంలో కేటీఆర్ డబ్బులు నొక్కేశారని.. ప్రభుత్వ డబ్బులను కాజేసినా ఊరుకోవాలా.? అని ప్ర‌శ్నించారు. ఎవరి జాగీరు అని డబ్బులు ఇష్ట రాజ్యంగా ఇచ్చారని మండిప‌డ్డారు.

కలెక్టర్ పై దాడి చేసినవారు ఎవరైనా వదిలేది లేదన్నారు. కేటీఆర్ నుండి కాల్ వెళ్ళగానే పట్నం నరేందర్ రెడ్డి తన కార్యకర్తలతో దాడి చేయించారన్నారు. మొన్నటివరకు మూసీ, హైడ్రా విషయంలో అబద్ధాలు ప్రచారం చేశారన్నారు. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని.. కుట్రలో భాగంగానే కలెక్టర్ పై దాడి జరిగిందన్నారు.

రైతులు కానీ వాళ్ళు, భూములు లేని వాళ్ళకి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అని ప్ర‌శ్నించారు. రాజకీయాల కోసం చిల్లర వేషాలు వేస్తున్నారని మండిప‌డ్డారు.. అధికారులపై దాడులు చేయడం ఏంటి.? అని ప్ర‌శ్నించారు. అధికారులపై దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. అభివృద్ధి ఆగిపోతే తరతరాలు బాధపడాల్సి వస్తుందని.. ముఖ్యమంత్రికి భేషజాలు లేవు అన్నారు. 16 నుండి జిల్లాల పర్యటనకి వెళ్తున్నామ‌ని.. మొదట కరీంనగర్ ప‌ర్య‌ట‌న‌ ఉంటుందని తెలిపారు.

Next Story