కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభివృద్ధి చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ ప్రమేయంతోనే పెద్ద ఎత్తున రైస్ స్కాం జరిగిందని ఆరోపించారు. సన్న బియ్యం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఎగుమతి చేసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. 15 మాసాల్లో ప్రజాపాలన మార్పు చూపించగలిగాం.. ప్రజల ఆకాంక్షలు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉంటుందన్నారు. ఉచిత బస్సు నుంచీ సన్న బియ్యం వరకు పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేపట్టిందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల ద్వారా మోక్షం లభించిందన్నారు.