గ్రూప్ 1 పరీక్ష పై.. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ లు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. బీసీ బిడ్డగా.. నేను మీకు మాట.. భరోసా ఇస్తున్న..సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా.. రిజర్వుడు కేటగిరీకి అన్యాయం జరగదన్నారు. జీఓ 29 తో నష్టం అనేది అపోహ మాత్రమే అన్నారు. బీజేపీ నేతలు ఏ మొకం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు.. బిఆర్ఎస్ నియామకాల పేరుతోనే అధికారం లోకి వచ్చిందన్నారు.
పదేళ్లలో tspsc నుండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండని ప్రశ్నించారు. ఇంటర్ మీడియట్ ఫలితాలు సక్కగా ఇవ్వలేని మీరు.. మా గురించి మాట్లాడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. బండి సంజయ్.. మీ హయం లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.. మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. 10 యేండ్ల లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చిన బిఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉందా.. పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ కి కమిట్ మెంట్ ఉందా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అయినా ఇచ్చిందా?.. ఇన్నాళ్లు ఉద్యోగాలు ఇవ్వని మీరు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారా అని ఫైర్ అయ్యారు.