బండి సంజయ్ దివంగత ప్రజా గాయకుడు గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలకు పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గద్దర్‌పై కేంద్ర మంత్రి బండి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఉనికి కోసం బండి సంజయ్ దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెఫ్ట్ భావజాలం గురించి మాట్లాడుతున్నారు. ఎంతో మంది కర సేవకులను కాల్చి చంపిన వాళ్లకు అవార్డు ఇచ్చారు.. లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళని మీ పార్టీలో ఎంతమందిని చేర్చుకోలేదని ప్రశ్నించారు.
గద్దర్ త్యాగం మర్చిపోయి కించపరిచే విధంగా మాట్లాడిండు.. బండి సంజయ్ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలన్నారు. పద్మ అవార్డులకు కూడా పార్టీ రంగును పులుముతున్నారు.. మీ వల్ల వాటి విలువ కూడా తగ్గుతుందన్నారు. గద్దర్‌ను కించపరచడం అనేది ప్రతి ఒక్క ఉద్యమకారున్ని కించపరిచినట్లేనన్నారు. మీరు అవార్డు ఇచ్చినా.. ఇయ్యకపోయినా గద్దర్ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గద్దర్‌ను ప్రశంసించిన సందర్భాన్ని బండి సంజయ్ మరిచిపోయిండు.. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన పాటతో తెలంగాణ వచ్చిందని బీజేపీ నాయకులు మాట్లాడారని గుర్తుచేశారు.