రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు.. బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్
12 ఏళ్ల బీజేపీ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధమా.? అంటూ బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు.
By Medi Samrat
12 ఏళ్ల బీజేపీ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధమా.? అంటూ బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. మీరు కార్పొరేటర్ కాదు.. కేంద్ర మంత్రి సంగతి మర్చిపోకండి అంటూ కౌంటరిచ్చారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తిరగడానికి నేను సిద్దం..? మీరు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నిసార్లు ఓడిపోయావో గుర్తు లేదా..? స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదు.. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి బండి సంజయ్ సిద్దంగా ఉండాలన్నారు.
రాముడు, దేవుడు పేరు చెప్పకుండా.. అయోధ్య అక్షింతలు అని ప్రచారం చేయకుండా గెలవగలవా అని సవాల్ విసిరారు. దేవుడు పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ, వేములవాడ రాజా రాజేశ్వర దేవాలయ అభివృద్ధికి గానీ ఒక్క పైసా అయినా ఇచ్చారా అని నిలదీశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులో అన్యాయం జరగుతుందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక దాటవేస్తూ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర మంత్రిగా తెలంగాణకు, కరీంనగర్‌కు ఏమీ చెశారో లెక్కలు చెప్పగలవా..? కరీంనగర్‌కు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు..? ఎంత మంది యువతకు ఉద్యాగాలు ఇప్పించారు..? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం అన్యాయం చేస్తున్నా.. బీసీ బిడ్డగా ఎందుకు ప్రశ్నిచండం లేదు..? మతం పేరుతో గెలుస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతుంది మీరు కాదా..? ముస్లిం పేరుతో బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న మీరు, మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలు బీసీల్లో ఉండడంపై ఏమి సమాధానం చెబుతారు..? అక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే లేనిది.. ఇక్కడిస్తే తప్పేంటి..? ముస్లింలలో పేదలు లేరా..? వారికి న్యాయం జరగకూడదా..? అని ప్రశ్నలు సంధించారు.
ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ నిర్ధిష్టంగా ఆధారాలతో నిరూపించడంతో సమాధానం చెప్పుకోలేక బీజేపీ పక్కదారి పట్టిస్తుందన్నారు యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడుతుంటే.. చొరవ తీసుకొని మాట్లాడలేని కేంద్ర మంత్రివి అంటూ ఎద్దేవా చేశారు. 12 ఏళ్ల బీజేపీ పాలనలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి.. తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చిద్దామా.? అని సవాల్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు.. మీకు సన్యాసం ఖాయం.. మఠంలో మీకు స్థిర నివాసం ఖాయం అంటూ జోస్యం చెప్పారు.