రాబోయే ఎన్నిక‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి : టీపీసీసీ చీఫ్‌

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్ని మెదక్ జిల్లా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  15 Oct 2024 2:35 PM IST
రాబోయే ఎన్నిక‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి : టీపీసీసీ చీఫ్‌

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అద్భుతమైన పాలన చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఇస్తున్నాం.. ఉద్యోగాల కల్పన చేస్థామన్నారు. బస్ లలో ఉచిత సౌకర్యాలు కల్పించమన్నారు. 2 లక్షల రూపాయల రుణ మాఫీ, 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల కరెంట్, స్కిల్ యూనివర్సిటీ, అనేక కొత్త విధానాలు అమలు చేస్తున్నాం అన్నారు. మీరంతా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్ళాలి.. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణాంగ ఉండేలా కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నిలకలో మనం మరింత గట్టిగా పని చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి..నియోజకవర్గ నాయకులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. టీపీసీసీ అధ్యక్షుడుగా నాకు ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. మెదక్ పూర్వ జిల్లాలో మనం మరింత గట్టిగా కృషి చేయాలన్నారు. నియోజక వర్గ ఇంచార్జ్ భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పని చేసి మంచి ఫలితాలు తేవాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని.. క్రమశిక్షణ అనేది చాలా కీలకంమన్నారు. క్రమశిక్షణ ఉల్లంగిస్తే ఊరుకునేది లేదన్నారు. మెదక్ జిల్లా లో మంచి ఫలితాలు సాధించే దిశగా పని చేయాలన్నారు.

Next Story