రాజ్యసభ రేసులో 16 మంది.. 8 చోట్ల ఎమ్మెల్యేలు సహకరించడం లేదని ఫిర్యాదులు..!

రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ..

By -  Medi Samrat
Published on : 3 March 2026 4:15 PM IST

రాజ్యసభ రేసులో 16 మంది.. 8 చోట్ల ఎమ్మెల్యేలు సహకరించడం లేదని ఫిర్యాదులు..!

రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఢిల్లీ పిలుస్తామని అన్నారు.. ఢిల్లీకి పిలుస్తారా? ఫోన్లో చర్చిస్తామా సాయంత్రం నిర్ణయిస్తామ‌న్నారు. రాజ్యసభ సభ్యుల గురించి నిన్న 30 నిమిషాల చర్చ జరిగిందని.. సామాజిక వర్గాల వారిగా 16 మంది పేర్లను ఇచ్చామ‌ని వెల్ల‌డించారు.

సమర్ధవంతమైన బీసీలు నలుగురు రాజ్యసభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు.. రాష్ట్రం నుండి ఒకరికి ఇస్తారా? లేదా ఇద్దరికి ఇస్తారా? అనేది రేపు తెలుస్తుందన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదని వెల్ల‌డించారు.. కార్పొరేట్ శక్తులకు బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం పని చేసిన వాళ్ళలో ఒక్కరికైనా బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందా? అని ప్ర‌శ్నించారు.

మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తామ‌న్నారు. కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోందన్నారు. పినరయి విజయన్‌ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారన్నారు. రాజకీయాల కోసమే పినరయి విజయన్‌ మాట్లాడుతున్నాడని.. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

మావోయిస్టుల అంశంపై మాట్లాడుతూ.. నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారన్నారు.. ఆపరేషన్ కగార్‌ను మేం వ్యతిరేకించాం.. పాకిస్థాన్ తో చర్చలకు ఒప్పుకున్న మోదీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదు అన్నారు. వాళ్ల సిద్ధాంతంతో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.. ప్రజల కోసం పోరాడిన వాళ్లపై గౌరవం ఉంటుందన్నారు. మేమయినా, మావోయిస్టులు అయినా పేద ప్రజల కోసమే పోరాటం చేశామ‌న్నారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతామ‌న్నారు. మేం ఎవరిని అడగలేదు. మమ్మల్ని ఎవరు అడ‌గ‌లేద‌న్నారు.

కొందరు డీసీసీ అధ్యకులు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారన్నారు. 8 చోట్ల ఎమ్మెల్యేలు సహకరించడం లేదని డీసీసీ అధ్యక్షులు ఫిర్యాదు చేశారు.. ఈ అంశంపై దృష్టి పెట్టమని రాహుల్ గాంధీ నన్ను ఆదేశించారు.. వెంటనే ఎమ్మెల్యేలతో మాట్లాడానన్నారు.

అమాయకుడైన రాహుల్ గాంధీని ఆడిపోసుకున్నారు.. మోదీ ఎప్ట్స్‌న్ ఫైల్స్ లో అడ్డంగా దొరికిపోయారు.. మోదీ వ్యవహారంపై బీజేపీ, ఆరెస్సెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story