కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం.. మాట ఇస్తే నిలుపుకుంటాం : టీపీసీసీ చీఫ్‌

By Medi Samrat  Published on  26 Jan 2025 6:30 PM IST
కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం.. మాట ఇస్తే నిలుపుకుంటాం : టీపీసీసీ చీఫ్‌

రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ప్రారంభ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్లొన్నారు. షాద్ నగర్ నందిగామ మండలం అప్పారెడ్డి గూడలో జ‌రిగిన కార్క‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ.. అభివృద్ది , సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతం ఆధారంగా కాంగ్రెస్ ప్రజా పాలన జ‌రుగుతోంద‌న్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇళ్లు ,రేషన్ కార్డు రాలేదన్నారు. చౌక బారు విమర్శలు చేయొద్దని ప్రతి పక్షాలను హెచ్చరించారు.

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరు పెట్టొద్దని అంటున్నాడు.. కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం.. మాట ఇస్తే నిలుపుకుంటాం అన్నారు. అన్ని కులాలు, మతాలను అక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్.. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మాటకు కట్టుబడి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామ‌న్నారు.

తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మర్చిపోయారన్నారు.. ఏడాది నుంచి కేసీఆర్ మీకు ఎక్కడైనా కనిపించాడా.? ఫాం హౌస్ కి పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకు? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేకపోయారన్నారు. కాంగ్రెస్ ఏడాదిలో 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం.. తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతుంద‌ని.. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో పథకాల అమలు చేస్తున్నామ‌న్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత పార్టీలకు అతీతంగా పరస్పరం సహకరించుకొని ప్రజల కోసం కలిసి పనిచేయాలన్నారు.

Next Story