ఆందోళన చెందకండి.. 20న మునుగోడుకు వస్తున్నా..!
TPCC Leader Revanth Reddy to Visit Munugodu On 20th. మునుగోడు ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి ఎప్పటిలాగే కుక్కతోక వంకరలాగా
By Medi Samrat Published on 15 Aug 2022 7:00 PM IST
మునుగోడు ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి ఎప్పటిలాగే కుక్కతోక వంకరలాగా ప్రజాప్రతినిధుల కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసి వాటిని చూపించి ఓట్లు అడిగితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు గౌరవించేవారని.. కానీ కేసీఆర్ తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. సర్పంచులను, ఎంపిటిసి లను కొనుగోలు చేయడం ద్వారా అక్కడ గెలవాలని ఒక దుర్మార్గమైన రాజకీయాలకు ఓడిగడుతున్నారని మండిపడ్డారు. నల్గొండకు ఓ పోరాట చరిత్ర ఉంది. ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి ఎంతో మంది పోరాట యోధులు ఉన్న ప్రాంతమని అన్నారు.
ఇక్కడ కూడా నాయకులను కొనుగోలు చేసి రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 20వ తేదీన మునుగోడుకు వస్తున్నాని తెలిపారు. 8 ఏళ్లుగా కాంగ్రెస్ శ్రేణులు ఎంతో కష్టపడ్డారు.. కొట్లాడారు.. నష్టపోయారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయంలో మనం చిన్న ప్రలోభాలకు లొంగి పోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామని.. కలిసి నిలబడి మునుగోడు లో కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ, టిఆర్ఎస్ లకు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కలిసి కట్టుగా పోరాటం చేసి మునుగోడులో విజయం సాధిద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.