నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాక పోవటం క్షమించరాని నేరం

TPCC Leader Revanth Reddy Fire On CM KCR. సీఎం కేసీఆర్.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  6 Aug 2022 7:23 PM IST
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాక పోవటం క్షమించరాని నేరం

సీఎం కేసీఆర్.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని తెలంగాణ కు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయాలపై నిలదియ్యాలని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించటం అంటే మోదీకి కేసీఆర్ వంగి పోవటమే అవుతోంది అని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాక పోవటం క్షమించరాని నేరం.. ఢిల్లీ వచ్చేందుకు కేసీఆర్ కు స్పెషల్ ఫ్లైట్ ఆరెంజ్ చేస్తాం అని రేవంత్ అన్నారు.

సీఎం కేసీఆర్ ఇంతకాలం మోదీతో కలిసి భాగస్వామిగా ఉన్నారు. నష్టాల‌ను రేపటి నీతి ఆయోగ్ మీటింగ్ లో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతారని భావించాం. మోదీకి, కేసీఆర్ కు ఉన్న చీకటి ఒప్పందంతోనే సమావేశాన్ని బహిష్కరించాలని అనుకుంటున్నార‌ని ఆరోపించారు. మోదీ సైతం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యతులపై ఉపయోగిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ల రద్దు, జీఎస్టీలపై మోదీని పొగిడారని అన్నారు.

ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం, మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టలేదని.. తెలంగాణ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత తో ఇద్దరి మధ్య దూరం అన్నట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోదీకి కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు. తెలంగాణలో దర్యాప్తు, ఇంటలిజెన్స్ వ్యవస్టలను ప్రతిపక్షాలను టార్గెట్ చెయ్యడానికి ఉపయోగించారని ఆరోపించారు.




Next Story