మరో 11 మంది నేతలపై టీపీసీసీ సీరియస్.. అందరికీ షోకాజ్ నోటీసులు జారీ
TPCC Issues Showcause Notice to Leaders. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఊహించని సమస్యలు వెంటాడుతున్నాయి.
By Medi Samrat Published on 20 Nov 2022 4:36 PM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఊహించని సమస్యలు వెంటాడుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీ ముఖ్య సమావేశాలను పట్టించుకోకపోవడం తెలిసిందే..! దీంతో పదకొండు మంది అధికార ప్రతినిధులకు పీసీసీ షోకాజ్ నోటీసులు అందజేసింది. హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన అధికార ప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించగా.. 13 మంది అధికార ప్రతినిధులుండగా.. సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరయ్యారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హాజరు కాకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.
హైదరాబాద్ లో శనివారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరవడం పట్ల పీసీసీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిన్న జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. మునుగోడు ఓటమి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం కావడంతో, ఆ ఉప ఎన్నిక ఫలితంపై సమీక్ష ఉంటుందని భావించారు. కానీ పెద్ద సంఖ్యలో అధికార ప్రతినిధులు ఈ జూమ్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు. జగ్గారెడ్డి వంటి సీనియర్ నేతలు ఇలా జూమ్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటని బాహాటంగానే ప్రశ్నించారు. జగ్గారెడ్డి కూడా ఈ జూమ్ సమావేశానికి గైర్హాజరయ్యారు.