రేపటి సభకు భారీగా తరలిరండి : టీపీసీసీ చీఫ్

ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా రేపు సోమవారం నాడు సచివాలయంలో తెలంగాణ తల్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉందని ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

By Kalasani Durgapraveen  Published on  8 Dec 2024 10:01 AM GMT
రేపటి సభకు భారీగా తరలిరండి : టీపీసీసీ చీఫ్

ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా రేపు సోమవారం నాడు సచివాలయంలో తెలంగాణ తల్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉందని ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ లతో జూమ్ సమావేశంలో మాట్లాడారు.

ఏడాదిలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. ఏడాది పాలనపై ప్రభుత్వం చేసిన సభలకు ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారని అన్నారు. రేపు ముగింపు ఉత్సవాలలో భాగంగా సచివాలయం వద్ద సాయంత్రం 4 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని ఆ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story