వీళ్లది ఆర్థిక విధ్వంసం.. వాళ్లది సవతి ప్రేమ : టీపీసీసీ చీఫ్
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి ప్రేమ చూపిస్తోంది.. టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik
వీళ్లది ఆర్థిక విధ్వంసం.. వాళ్లది సవతి ప్రేమ : టీపీసీసీ చీఫ్
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి ప్రేమ చూపిస్తోంది.. టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభివృద్ధికి బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం అడ్డుగా మారింది. బీజేపీతో సర్కార్‌తో కేసీఆర్ బడే భాయ్, చోటా భాయ్‌లా వ్యవహరించారు. అన్ని అంశాల్లో కేంద్రంలోని బీజేపీకి మద్దతిచ్చిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణకు రావాల్సిన నిధులను అడిగి తీసుకురాలేకపోయారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విభజన అంశాలను కేసీఆర్ గాలికొదిలేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయింది. అని మహేష్ కుమార్ ప్రశ్నించారు.
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు సమపాలలో ప్రాధాన్యతిస్తూ, రూ.3,04,965 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయం. ప్రజాపాలనలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మాది ప్రజా ప్రభుత్వమని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ వివక్ష చూపిస్తోంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళా సాధికారతతో పాటు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికల్లో అభయహస్తం ప్రకటించిన కాంగ్రెస్ వరుసగా రెండో సారి కూడా బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు పెద్ద పీట వేసి మాది చేతల ప్రభుత్వమని రుజువు చేసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అగ్ర తాంబూలం వేస్తూ రూ.56,084 కోట్లు కేటాయించి మాది పేదల ప్రభుత్వమని నిరూపించుకున్నాం. పేదల పక్షపాతి అయిన కాంగ్రెస్ ప్రజా సంక్షేమం బడ్జెట్ పై ప్రతిపక్షాలు అర్థరహిత విమర్శలు చేయడం శోచనీయం..అని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
Live || Telangana Legislative Council Day -06 https://t.co/W7HJuHC0Uf
— Telangana Congress (@INCTelangana) March 21, 2025