పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్‌ తొలి ప‌ర్య‌ట‌న‌

TPCC Cheif Revanth Reddy Visit Nirmal. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్మల్ కు బయలుదేరారు. రేవంత్ రెడ్డి.. పీసీసీ

By Medi Samrat
Published on : 12 July 2021 9:39 AM IST

పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్‌ తొలి ప‌ర్య‌ట‌న‌

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్మల్ కు బయలుదేరారు. రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షులు అయ్యాక రాష్ట్రంలో చేప‌ట్టిన‌ తొలి పర్యటన ఇదే కావ‌డం విశేషం. అయితే.. గ‌త‌కొద్ది రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై పోరాటంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఎడ్ల బండ్లు, సైకిళ్లు ర్యాలీలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా నిర్మల్ లో జరిగే నిర‌స‌న కార్య‌క్ర‌యంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి కొద్దిసేప‌టి క్రితం బ‌య‌లుదేరారు. రేవంత్ రెడ్డి వెంట ఏఐసీసీ కార్యక్రమాల సమన్వయ కర్త ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు.




Next Story