సచివాలయం ఏమైనా కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా..? : రేవంత్ రెడ్డి
TPCC Cheif Revanth Reddy Fire On CM KCR. నిర్మాణంలో ఉన్న కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు
By Medi Samrat Published on 3 Feb 2023 10:23 AM GMTనిర్మాణంలో ఉన్న కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బృందం గాంధీ భవన్ నుంచి సచివాలయానికి బయలుదేరింది. గాంధీ భవన్ వద్ద పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి గోశామహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన నేతలలో షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, రోహిన్ రెడ్డి, అనిల్ యాదవ్, మల్రెడ్డి రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
సచివాలయంలో అగ్నిప్రమాదం పై నిజానిజాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
— Revanth Reddy (@revanth_anumula) February 3, 2023
సచివాలయం ఏమైనా కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా?
అంత రహస్యం వెనుక ఉన్న మర్మం ఏమిటి? అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలను తక్షణం విడుదల చేయాలి. pic.twitter.com/izhcYmBKOt
కాంగ్రెస్ నాయకుల అరెస్టుపై రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. సచివాలయంలో అగ్నిప్రమాదం పై నిజానిజాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సచివాలయం ఏమైనా కేసీఆర్ ప్రైవేటు ఫాంహౌసా..? అంత రహస్యం వెనుక ఉన్న మర్మం ఏమిటి? అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలను తక్షణం విడుదల చేయాలని ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయంలో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉడ్ వర్క్ జరుగుతున్న చోట షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.