కేటీఆర్ ఆస్తులు పెరిగాయి తప్ప.. అమరుల కుటుంబాల ఆదాయం పెరగలేదు : మధుయాష్కి గౌడ్

TPCC Campaign Committee Chairman Madhuyashki Goud Sensational Comments On KTR. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఆస్తులు పెరిగాయి తప్ప.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన

By Medi Samrat  Published on  7 July 2023 6:03 PM IST
కేటీఆర్ ఆస్తులు పెరిగాయి తప్ప.. అమరుల కుటుంబాల ఆదాయం పెరగలేదు : మధుయాష్కి గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఆస్తులు పెరిగాయి తప్ప.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాల ఆదాయం పెరగలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఒక్కసారి గాంధీ కుటుంబ చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. దేశానికి స్వతంత్ర్యం వచ్చిన నాటి నుండి ప్రజాసేవలో భాగంగా ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబ‌ సభ్యుడైన.. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేసీఆర్, కేటీఆర్ లకు లేదని అన్నారు.

దేశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భాయి భాయి అని అన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేన‌న్నారు. లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడి కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు ఉన్నా అరెస్ట్ చేయలేని స్నేహం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలదన్నారు. తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది.. భోగం బీఆర్ఎస్ పార్టీద‌ని విమ‌ర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంబేద్క‌ర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన అమలవుతుంది.. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు.

అమరుల త్యాగాలను కేసీఆర్ విస్మయించార‌ని అన్నారు.. బంధిపోటు దొంగలా వ్యవహారిస్తున్న కేసీఆర్ ను రానున్న రోజుల్లో బొందపెడతార‌ని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధారాలు లేకుండా మాట్లాడాడుతున్నారని.. దమ్ముంటే ఆధారాలతో రండి.. చర్చలకు సిద్ధం అన్నారు. గాడ్సేను పూజించే బీజేపీ పార్టీకి తొత్తుగా మారిన బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కు గాంధీజీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ ల ఆశయాలను కేసీఆర్, కేటీఆర్ లు విస్మరించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, నాయకులపై చులకనగా మాట్లాడితే చురకలు పెట్టే సమయం దగ్గరలోనే ఉంది.. కేటీఆర్ అంటూ హెచ్చ‌రించారు.


Next Story