తెలంగాణలో జనవరి 1వ తేదీన సెలవు ఉండనుంది. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఇప్పటికే క్రిస్మస్ పండుగతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో రాష్ట్రంలోని పాఠశాలలకు వరుస సెలవులు వచ్చాయి. దీంతో పిల్లలు వారమంతా సరదాగా గడిపారు. ఇప్పుడు మరో రోజు సెలవు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
జనవరి 1, 2025వ తేదీన సెలవు ప్రకటించింది. న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెబుతూ చాలా మంది ఇవాళ, రేపు సంబురాలు జరుపుకుంటారు. మన దేశంలో కూడా కొత్త సంవత్సరం సంబురాలు అంబరాన్ని అంటుతాయి. ఈ కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ఇచ్చింది. అటు ఏపీలో జనవరి 1న పబ్లిక్ హాలిడే లేదు. దీంతో రేపు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి. మొన్న క్రిస్మస్ పండుగకు కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కరోజే సెలవు ఇచ్చింది. బాక్సిండ్ డే రోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చిన విషయం తెలిసిందే.