తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. కాగా రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు స్వీకరించినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి 3,379 నామినేషన్లు ఉన్నట్లు తెలిపింది.
అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి 2,506 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొంది. మరో వైపు బీజేపీ నుంచి 1,709, బీఎస్పీ 142, సీపీఐ(ఎం) 88, ఎంఐఎం 166, ఆప్ 17, టీడీపీ నుంచి 10 నామినేషన్లు వచ్చినట్లు తెలిపింది. దీంతో తొలి రోజు వచ్చిన వాటితో కలిపి మొత్తం నామినేషన్ల సంఖ్య 9,276కి చేరింది. అయితే నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో మరింత పెరిగే అవకాశం ఉంది.