ఖాతాల్లోకి డబ్బులు.. 3 రోజులే ఛాన్స్‌

రైతు భరోసా పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌...

By -  అంజి
Published on : 23 March 2026 6:44 AM IST

Farmers, Rythu Bharosa scheme, Telangana Govt, CM Revanth Reddy

ఖాతాల్లోకి డబ్బులు.. 3 రోజులే ఛాన్స్‌

రైతు భరోసా పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌ పొందిన రైతులు, ఇప్పటి వరకు రైతుభరోసా పొందని, బ్యాంక్‌ వివరాలు నమోదు చేయని వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్లికేషన్‌ ఫామ్‌తో పాటు జిరాక్స్‌, మొబైల్‌ నంబర్‌ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు మీ దగ్గర్లోని ఏఈవోలను సంప్రదించండి.

అటు నిన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయం “రైతు భరోసా” నిధులను విడుదల చేశారు. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మీట నొక్కి నిధులను విడుదల చేశారు. నేటి నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయని, వచ్చే 45 రోజుల్లోగా 9 వేల కోట్ల రూపాయలు రైతులందరి ఖాతాల్లో నిధులు చేరిపోతాయని చెప్పారు.

ఈ సందర్బంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాం 114 నెలల కాలంలో రైతు సంక్షేమం కోసం సగటున ప్రతి నెల 2,533 కోట్లు ఖర్చు చేస్తే, ప్రజా ప్రభుత్వం గడిచిన 28 నెలల కాలంలో ప్రతి నెల 5,500 కోట్లు ఖర్చు చేసింది. రైతుల కోసం ఉచిత కరెంట్, గిట్టుబాటు ధరలు, సన్నవడ్లకు బోనస్, రుణమాఫీ, రైతుభరోసా, బీమా, అకాల వర్షాలొచ్చినప్పుడు పంట నష్టపరిహారం... మొత్తంగా రూ. 1.30 లక్షల కోట్లను ఖర్చు చేసి రైతు రాజ్యంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.

Next Story