Vikarabad : పిడుగుపాటుకు ముగ్గురు మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. యాలాల్ మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు.

By Medi Samrat  Published on  19 May 2024 5:21 PM IST
Vikarabad : పిడుగుపాటుకు ముగ్గురు మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. యాలాల్ మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. యాలాల్ మండలంలోని బేన్నూరు గ్రామంలో నివాసం ఉంటున్న గొల్ల వెంకటయ్య( 62)పై ఒక్కసారిగా పిడుగు పడటంతో అతను అక్కడి కక్కడే మృతి చెందాడు. భార్య ఎల్లమ్మతో కలిసి పొలం పనులు చేస్తుండగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పిడుగు పడింది. దీంతో గొల్ల వెంకటయ్య చనిపోగా.. అతని భార్య కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పింది.

అలాగే పెర్కంపల్లి గ్రామంలో మరో ఇద్దరు బలి అయ్యారు. జుంటు పల్లి గ్రామానికి చెందిన మంగలి శ్రీనివాస్(27, )కొన్నింటి లక్ష్మప్ప(52) పిడుగు పాటుకు మృతి చెందారు. రెండు గ్రామాల్లో తిరుగుబడి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో ఆ గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story