బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలిస్తున్నట్లు సమాచారం. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ఆ సమయంలో సంజయ్‌ను ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్ల కారణంగా ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా స్వల్ప ఘర్షణకు దారి తీసింది.
ఈ క్రమంలో కరీంనగర్ ఆర్డీవో ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ కౌశిక్ రెడ్డిపై పోలీసులకు కంప్లైట్ ఇచ్చారు. దీంతో కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352, 292 కేసులు నమోదు చేశారు. మరో ఫిర్యాదు కూడా నమోదు కావడంతో ఆయపై 126 (2),115(2) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.