బెదిరింపులు కాల్స్‌ చేసిన వ్యక్తికి సీఎం నంబర్ ఇచ్చా : రాజాసింగ్

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు

By Medi Samrat  Published on  29 May 2024 12:52 PM GMT
బెదిరింపులు కాల్స్‌ చేసిన వ్యక్తికి సీఎం నంబర్ ఇచ్చా : రాజాసింగ్

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. బెదిరింపు కాల్స్ వచ్చిన ఫోన్ నంబర్లకు సంబందించిన కాల్ లిస్ట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మరోసారి తనకు అనేక నంబర్ల నుండి హత్య బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. తనను గతంలో కూడా బెదిరించారని.. గతంలో కూడా ఫిర్యాదు చేశానని, అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. బాధ్యాతాయుతమైన పౌరుడిగా ఈ పరిస్థితిని పోలీసు శాఖకు తెలియజేయడం తన కర్తవ్యమని భావిస్తున్నానని ఎక్స్ లో రాసుకొచ్చారు.

బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చానని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. తనకు ఉదయం నుండి రకరకాల ఫోన్ నెంబర్లనుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఒకరు వాట్స్అప్ కాల్ కూడా చేశారని రాజాసింగ్ అన్నారు. ఇవ్వాళ నాకు కంటిన్యూయస్ గా బెదిరింపు కాల్స్ వచ్చాయి.. గూగుల్ లో సెర్చ్ చేస్తే పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్ పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు అందుకే ముఖ్యమంత్రి నంబర్ కు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారా.? లేదా. ?విచారణ సాగుతుందా.? లేదా.? అనేది చూద్దామని సీఎం ఫోన్ నెంబర్ ఇచ్చానని రాజసింగ్ అన్నారు.

రాజా సింగ్ ఇటీవల హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ‘బోగస్ ఓటింగ్’పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా చాలా మంది బురఖా ధరించిన వాళ్లు.. హిందూ మహిళలకు ఓట్లు వేశారని ఆరోపించారు. బోగస్ ఓటింగ్‌ జరుగుతున్నప్పుడు AIMIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీకి రాష్ట్ర పోలీసులు మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు. మాధవి లత హైదరాబాద్‌లో గొప్ప పోరాటం చేశారని.. దురదృష్టవశాత్తు, అన్ని బూత్‌లలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓటింగ్ జరిగిందని అన్నారు.

Next Story