మేడారం మహా జాతర.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్‌

ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

By -  అంజి
Published on : 27 Jan 2026 8:00 AM IST

parents, students,holidays, schools, Medaram Maha Jatara, Telangana

మేడారం మహా జాతర.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్‌

ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రూ.251 కోట్లతో ఆలయ పునరుద్ధరణ చేపట్టింది. సుమారు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి టీజీఎస్‌ఆర్టీసీ 4 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 15 వేల మంది సిబ్బందితో పోలీసు శాఖ భారీ బందోబస్తు నిర్వహిస్తోంది.

రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం మహా జాతరకు కుటుంబ సమేతంగా వెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. దీంతో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతర నేపథ్యంలో హాలిడేస్‌ ప్రకటించాలని పేరెంట్స్‌ అంటున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఇవాళో, రేపో ఏదైనా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇప్పటికే మేడారం జాతర జరిగే 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని పీర్టీయూ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి జాతరకు వెళ్లే అవకాశం ఉండటంతో సెలవులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం మేడారం జాతరను రాష్ట్ర పండగగా నిర్వహిస్తుండటంతో రాష్ట్రమంతా సెలవులు ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది.

Next Story