వారికి కష్టం వస్తే పట్టించుకునే నాధుడు లేకపోవడం దురదృష్టకరం

The problems of construction workers should be solved. దేశాభివృద్ధిలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర ఎంతో విలువైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  28 Sept 2022 2:08 PM IST
వారికి కష్టం వస్తే పట్టించుకునే నాధుడు లేకపోవడం దురదృష్టకరం

దేశాభివృద్ధిలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర ఎంతో విలువైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. మన కంటికి కనిపించే అద్భుత కట్టడాల వెనుక రక్తాన్ని చెమటగా మార్చిన ఎంతో మంది కార్మికుల కష్టం దాగి ఉంటుంది. ఇంజినీర్లకు సైతం క్లిష్టంగా అనిపించే పనులను కూడా తమ నైపుణ్యంతో చిటికెలో పూర్తి చేస్తారు. అటువంటి కార్మికులకు కష్టం వస్తే పట్టించుకునే నాధుడు లేకపోవడం దురదృష్టకరం అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. వారి సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేకపోవడం బాధకరమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సహకరించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం (బీఎన్కేఆర్‌ఎస్‌) తెలంగాణ రాష్ట్ర కమిటీ బుధవారం రేవంత్‌ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు

కార్మికుల కోరుకున్న విధంగా భవన నిర్మాణ సమయంలో మరణించిన వారికి ఇచ్చే ప్రమాద బీమాను 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాను. ప్రమాదంలో గాయపడితే రూ. 5 లక్షల బీమాతోపాటు కోలుకునే వరకు ప్రతి నెల రూ. 5వేల సహయం అందజేయాలి. భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ హాస్పిటల్‌ సదుపాయాలు, కార్మికుల పిల్లలకు కార్పొరేట్‌ స్కూళ్లలో 5శాతం సీట్లు, విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌ లు, కార్మికుల సంక్షేమ బోర్లు జారీ చేసిన కార్డు ఉండి 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ. 5 వేల పెన్షన్‌ వంటి ప్రయోజనాలు కల్పించాలి. ఇంతకు ముందు హామీ ఇచ్చిన విధంగా జిల్లా, మండల కేంద్రాల్లో కార్మికుల భవనం కోసం 10 గుంటల స్థలం, నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయాలి. లేబర్‌ అడ్డాల్లో కార్మికుల కోసం షెల్టర్‌ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం చేపట్టిన స్కిల్‌ డెవలప్‌ మెంట్లో భాగంగా కార్మికులకు ఇచ్చి సర్టిఫికెట్‌ మంజూరు చేయాలి. వీరికి రూ. 50 లక్షల వరకు ప్రభుత్వం చేపట్టే పనుల్లో ప్రాధాన్యం, మున్సిపాలిటీల నుంచి ఎలాంటి రుసుంలేకుండా బిల్డర్‌ లైసెన్స్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

భవన నిర్మాణ సంక్షేమ బో ర్డులో చైర్మన్‌ గా, సభ్యులుగా భవన నిర్మాణ కార్మికులను మాత్రమే నియమించాలి. సంక్షేమ బోర్డుకు సెస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించాలి. ఇళ్లు లేని భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లలో ప్రాధాన్యం ఇవ్వాలని రేవంతి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తానని రేవంత్‌ రెడ్డి తనను కలిసిన బీఎన్కేఆర్‌ఎస్‌ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో నిర్వహించే సమయంలో కార్మికులను రాహుల్‌ గాంధీతో కలిపించి వారి సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానని కూడా రేవంత్‌ రెడ్డి వారికి మాటిచ్చారు.


Next Story